పయనించే సూర్యుడు చింతూరు డివిజన్ ఇంచార్జ్ ది. 26.03.2025
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పుట్టి రమేష్ బాబు
తెలుగుదేశం పార్టీ మండల ఎస్టీసెల్ అధ్యక్షులు కనితి మధు
ఎటపాక మండలం లక్ష్మీపురం పంచాయతీలో సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రంపచోడవరం ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమంలో వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమం ఉద్దేశిస్తూ వినతిపత్రంలో కనితి మధు తెలియజేస్తూ. కృష్ణవరం పంచాయతీ కొత్తూరు గ్రామంలో అలుగు వాగు ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువ తీస్తే సుమారు 1000 ఎకరాలు నీరు అందుతుందని కన్నాపురం రంగాపురం పట్టుచీర లక్ష్మీపురం బూరువాయి రైతులు ఈ కాలువ ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఎడమ కాలువ తీసి రైతులను ఆదుకోవాలని కోరారు లక్ష్మీపురం పట్టుచీర గ్రామంలో అంగనవాడి నూతన బిల్లింగ్ నిర్మించాలని అలాగే మద్దిమడుగు పట్టుచీర గ్రామాలలో కరెంటు సమస్య తీర్చాలని కణితి మధు తెలియజేశారు. ఈ సమస్యలు తెలుసుకున్న గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష భాస్కర్ గారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉండేటి వెంకన్న, ఉండేటి రమేష్, లక్ష్మీపురం పంచాయతీ మాజీ సర్పంచ్ పెనుబల్లి సీతయ్య, తెల్లం సత్యం, ముర్రం నాగరాజు, బాలరాజు బోడ లింగయ్య తదితరులు పాల్గొన్నారు