పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 9 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రజిత, టెక్నికల్ అసిస్టెంట్ మహేంద్ర నాయుడు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాసులు ఈరోజు సందర్శించారు. వీరికి ఆలయ అర్చకులు హరినాథ శర్మ, వేద ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. పురాతనమైన దేవాలయ వైశిష్యాన్ని అర్చకులు హరినాధ శర్మ చక్కగా వివరించారని అన్నారు. ఆలయంలో పడమర వైపు ఉన్న పురాతన సత్రం శిథిలావస్థకు చేరుకుందని, సత్రాన్ని తొలగించి నూతన మంటపాన్ని నిర్మించేటట్లు చూడాలని రజితను ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని రజిత తెలిపారు. త్వరలో జిల్లా కలెక్టర్ ను యాడికి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని సందర్శించేటట్లు చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, మాజీ సర్పంచ్ గోపాలనాయుడు, మద్దాల సుబ్రహ్మణ్యం, బంగారు బాల, తాండ్ర విక్రమ్, పల్లా చితంబరి, దాసరి పాండు,తదితరులు పాల్గొన్నారు.