లక్ష్యం అకాడమీ చైర్మన్ లక్ష్మీనారాయణ
జనం న్యూస్ సెప్టెంబర్ 15 ( గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)
మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థానానికి ఎదిగి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని విశ్రాంత ఉపాధ్యాయులు రఘురామిరెడ్డి తెలిపారు. గోరంట్ల పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో గోరంట్ల పట్టణంలో లక్ష్యం అకాడమీ ఎడ్యుకేషన్లో విద్యను అభ్యసించిన అకాడమీ పూర్వ విద్యార్థులు పట్టణానికి చెందిన గంధం చందన శ్రీధర్ దంపతుల కుమారుడు ప్రవేట్ స్టడీస్ ద్వారా విద్యనభ్యసిస్తున్న ధీరజ్ ను అదేవిధంగా పట్టణానికి చెందిన బార్బర్ శేఖర్ ఉమాదేవి కుమారుడు చైతన్య పదవ తరగతి వరకు గోరంట్ల జిల్లా పరిషత్ పాఠశాలలో, తర్వాత ఆర్ డి టి సెట్ ద్వారా ఇంటర్ విజయవాడలో విద్యనభ్యసించి, ప్రస్తుతం నీట్ ద్వారా చిత్తూరు అపోలో లో ఎంబీబీఎస్ శీతో సాధించిన విద్యార్థి చైతన్య లక్ష్యం అకాడమీలో విద్యనుభ్యసించిన పూర్వపు విద్యార్థులైన వీరిరువుని లక్ష్యం అకాడమీ ఎడ్యుకేషనల్ సిబ్బంది ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రఘురాం రెడ్డి, ఉపాధ్యాయులు గోవింద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘురాంరెడ్డి మాట్లాడుతూ…మంచి విద్యార్థికి క్రమశిక్షణ, ఉత్సుహకత, సమయపాలన, స్వీయ-ప్రేరణ, విమర్శనాత్మక ఆలోచన, సహకారం, సానుకూల వైఖరి, అనుకూలత మరియు స్థితిస్థాపకత వంటి లక్షణాలు ఉండాలి అని, ఈ లక్షణాలు విద్యార్థుల వ్యక్తిగత మరియు విద్యా విషయక ఎదుగుదలకు సహాయపడతాయని, ముఖ్యంగా ఈ లక్షణాలు జీవితంలో విజయం సాధించడానికి పునాది వేస్తాయని, విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణ విజయానికి ఒక ముఖ్యమైన లక్షణం. క్రమశిక్షణతో కూడిన విధానం వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో విజయాన్ని సాధిస్తుంది.ఉత్సుహకత అనే లక్షణం కొత్త విషయాలు నేర్చుకోవాలనే కోరిక, జ్ఞానాన్ని పొందాలనే ఆసక్తి విద్యార్థులకు చాలా ముఖ్యం.ఇక సమయపాలన అనే లక్షణం తమ పనులను సకాలంలో పూర్తి చేయడానికి సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడం అవసరం. పని నీతి అనే లక్షణం తమ పనిని అంకితభావంతో, శ్రద్ధతో చేయడం,ఈ లక్షణాల ప్రాముఖ్యత ఏమిటంటే….? ఈ లక్షణాలను పెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులు తమ విద్యా జీవితంలోనే కాకుండా, భవిష్యత్తులో కూడా విజయవంతమైన వ్యక్తులుగా ఎదగడానికి పునాది వేసుకుంటారని రఘురాం రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ… విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, క్రమశిక్షణ లక్ష్యాన్ని సాధించడానికి విద్యార్థికి చాలా సహాయపడుతుందని,. క్రమశిక్షణ లేని విద్యార్థి చేసే ఏ పనీ సకాలంలో పూర్తికాదని,దీనివల్ల అలాంటివారు తమ మార్గం నుంచి తప్పుదారి సైతం పడుతారని,అందువల్ల, విజయం సాధించడానికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు చెడు ప్రభావానికి లోను కాకుండా భవిష్యత్తును లక్ష్యంగా ఎంచుకొని మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా పోటీ ప్రపంచంలో నెగ్గి ఉన్నత స్థానాలకు ఎదగాలని,గతంలో చదువుకోవడానికి వసతులు లేవని మారుతున్న కాలానికి అనుగుణంగా తిండి లేకున్న మంచి చదువు అందించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారని, మీరంతా పోటీ ప్రపంచంలో నెగ్గేలా విధానపరమైన మార్పులను అవగతం చేసుకోవాలని గోవిందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్యం అకాడమీ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ , బోధనా సిబ్బంది, అకాడమీ విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు