పయనించే సూర్యుడు// జనవరి 29// హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..
లక్ష డప్పులు- వేల గొంతుల మహిళా డప్పు కళామండలి జిల్లా అధ్యక్షురాలు జ్యోతి కి ఘన సన్మానం చేసిన..మాజీ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్- స్వర్ణ దంపతులు...ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మాదిగలను, మాదిగ ఉప కులాలను ఏకం చేయడం కోసం లక్ష డప్పులు వేల గొంతుల మహాకళా ప్రదర్శన చేపట్టిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తలపెట్టిన కళా మండలి లో నూతనంగా ఎంపికైన కరీంనగర్ జిల్లా మహిళా డప్పు కళాకారుల జిల్లా అధ్యక్షురాలు నక్క జ్యోతి,జిల్లా ఉపాధ్యక్షురాలు డప్పు రాధలను మాజీ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ స్వర్ణ లు బుధవారం హుజురాబాద్ లోని తన నివాసానికి మర్యాద పూర్వకంగా ఆహ్వానించి శాలువతో సత్కరించి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణ సాధన కోసం గత 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటం చేయడంతో సుప్రీంకోర్టు ఏడుగురి జడ్జీలతో, కూడిన ధర్మాసనం వర్గీకరణ చేయడం ద్వారా ఎస్సీ 59 ఉప కులాలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయం జరుగుతుందని,తీర్పు ఇవ్వడంతో సంపన్న మాలలైనటువంటి కొంతమంది స్వార్థపరులు ఆ తీర్పును అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడంతో,మందకృష్ణ మాదిగ లక్ష డప్పులు వేల గొంతుల మహా కళా ప్రదర్శన ఫిబ్రవరి 7న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నిరసన తెలుపుతూ ..మాదిగ మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నారని,అందులో భాగంగా పురుషుల డప్పు కళాకారులకు దీటుగా మహిళా డప్పు కళాకారుల కళా మండలి ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందన్నారు.అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రతి మాదిగ మాదిగ ఉపకులాల ప్రజలందరూ ఇండ్లకు తాళాలు వేసి కుటుంబ సభ్యులందరూ ఆ మహా కళా ప్రదర్శన వేలాదిగా కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళామండలి జిల్లా అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు) జిల్లా ఉపాధ్యక్షులు అంబాల శ్రీరామ్, హుజరాబాద్ నియోజకవర్గ అధ్యక్షురాలు ఆకినపల్లి శిరీష తదితరులు పాల్గొన్నారు.