పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 2 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలుర మండల కేంద్రంలో సాలూర గ్రామంల ఈనెల 7వ తేదీన హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న లక్ష డప్పులు - వేయి గొంతుకల కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం పోస్టర్లను ఆదివారం సాలూర మండల కేంద్రంలోని దండోరా సంఘంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాలూర మండల అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనకై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం పట్ల నిరసిస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహిస్తున్న లక్ష డప్పులు - వేయి గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది మందితో తలపెడుతున్న ఈ భారీ సాంస్కృతిక ఉద్యమాన్ని ప్రతి ఇంటి నుంచి మాదిగలు డప్పులతో తరలివచ్చి ప్రపంచానికి మన ఆవేదన చాటి చెప్పాలని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ జిల్లా నాయకులు లింబూరి లక్ష్మణ్, గ్రామ అధ్యక్షులు సుభాష్, కార్యదర్శి రవి, చంటి,రాజు, మొండూరి లక్ష్మయ్య, లింబయ్య, సాయిలు, మహిళలు పాల్గొన్నారు