
పంట నాశననికి విత్తనాలు కారణమా..
కలుపు మందులు కెమికల్ కారణమా..
పయనించే సూర్యుడు జనవరి 02 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ మండల పరిధిలోని రేపల్లెవాడ గ్రామం లో 14 ఎకరాల మొక్కజొన్న తోట ఎర్రగా మాడిపోయి, తోటంతా ఎదుగుదల లేక కుళ్ళిపోయిన దుస్థితి ఏర్పడింది. వివరాలలోకి వెళ్తే సాయిన్ని అప్పారావు అనే కౌలు రైతు రేపల్లెవాడ గ్రామ శివారులో 14 ఎకరాలు కౌలు కి తీసుకుని మొక్కజొన్న సాగు చేస్తున్నారు. సింజెంటా 602 అనే ఒకే రకం మొక్కజొన్న విత్తనాలు ఒక ఏజెంట్ ద్వారా కొనుగోలు చేసి సాగు చేశారు. ఇటీవల 10 రోజుల క్రితం భాస్కర్ ఆగ్రో కంపెనీ టింజర్ మరియు అట్రాజిన్ కలుపు మందు పిచికారీ చేసారు. కలుపు మందు పిచికారీ చేసిన 4వ రోజు నుండి తోటంతా ఎర్రగా మాడిపోయి, ఎదుగుదల లేక కుళ్ళి పోవడం గమనించిన రైతు వ్యవసాయ అధికారులను, మొక్కజొన్న విత్తనాలు ఇచ్చిన డీలర్లను, కలుపు మందు ఇచ్చిన భాస్కర్ ఆగ్రో కంపెనీ వారికి సమాచారం అందించగా వారు వచ్చి తోటను పరిశీలించారు. భాస్కర్ ఆగ్రో కంపెనీ ఏజెంట్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మా కంపెనీ అందించిన గడ్డి మందు నాణ్యమైనదే అని, పొరపాటు ఎక్కడ జరిగిందో వ్యవసాయ అధికారులు శాంపిల్స్ తీసుకుని పరీక్షించి చెప్పాలని అన్నారు. కౌలు రైతు సాయిన్ని అప్పారావు మాట్లాడుతూ ఎన్నెన్నో కష్టాలు పడి సొంత భూమి లేక కౌలుకు భూమి తీసుకొని వ్యవసాయం చేసి, 14 ఎకరాలు మొక్కజొన్న వేసాను, కౌలు డబ్బులు ముందే 5 లక్షలు ఇచ్చి, మరో 5 లక్షలు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నాను. 10 రోజుల క్రితం భాస్కర్ ఆగ్రో కంపెనీ వారి వద్ద నుండి టింజర్ మరియు అట్రాజిన్ గడ్డి మందు కొనుగోలు చేసి తోటకు పిచికారీ చేశాను, పిచికారీ చేసిన 4వ రోజు నుండి తోటంతా ఎర్రగా మారి, ఎదుగుదల లేక కుళ్ళిపోయింది. ఎన్నో ఆశలతో సాగు చేస్తున్న పంట ఇలా నాశనం అవుతుందని అనుకోలేదని, మాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని, ఇంత నష్టం భరించలేనని ఇప్పుడు మాకు చావే శరణ్యం అని, వ్యవసాయ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లాలని, ఆగ్రో కంపెనీ వారు కానీ, విత్తనాలు వారు కానీ తక్షణమే మాకు న్యాయం జరిగేలా చూడాలని కౌలు రైతు సాయిన్ని అప్పారావు దంపతులు వారి బాధని వెళ్ళబుచ్చారు. రైతు బాధని చూసి స్థానికులు చలించిపోయారు
