
రుద్రూర్, నవంబర్ 28 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిది) :
రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ ఆలయం వద్ద శుక్రవారం రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ వారి సహకారంతో ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 78 మంది రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో 16 మంది రోగులకు కంటిలో మోతె బిందు ఉన్నట్టు గుర్తించి వారికి లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ వారికి రెఫర్ చేయడం జరిగింది. లయన్స్ కంటి ఆసుపత్రి కంటి నిపుణులు అజయ్ గౌడ్, వారి సిబ్బందితో రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు లయన్ కె.వి.మోహన్, జిల్లా చైర్మన్ లయన్ శ్యాంసుందర్ పహాడే, కార్యదర్శి గుండూరు ప్రశాంత్ గౌడ్, క్లబ్ కార్యవర్గ సభ్యులు లయన్ కటికే రామ్ రాజ్, గ్రామవాసులు సతీష్ గౌడ్, ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.