1).లవణం- హేమలత లవణం దంపతుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే పోచారం…
2).సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి..
రుద్రూర్, ఆగస్టు 14 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని సంస్కార్ ప్రకృతి ఆశ్రమంలో లవణం-హేమలత లవణం దంపతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ లు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. లవణం-హేమలత లవణం దంపతులు జోగిని వ్యవస్థను తొలగించారని అన్నారు. ఈ ప్రకృతి ఆశ్రమాన్ని మంతెన సత్యనారాయణ రాజు, మార్ని రామకృష్ణలు ఎంతో కష్టపడి కాపాడుతూ వస్తున్నారని, ఈ ఆశ్రమంలో సుమారు 100 మంది వరకు ఉపాధి పొందుతున్నారన్నారు. సంస్కార్ ప్రకృతి ఆశ్రమాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, జాహిరాబాద్ పార్లమెంట్ దిశ కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం, సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ పత్తి రాము, బందెల సంజీవ్, షేక్ ఖాదర్, రామాగౌడ్, అధికారులు తహసీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ భీంరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రకృతి ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.