ఎమ్మెల్యేలు గంటా, సుందరపు,పంచకర్ల
జనం న్యూస్,జూలై21,రాంబిల్లి:
రాంబిల్లి మండలం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేసిన లాలం భాస్కరరావు పేరు మీద వచ్చే మూడేళ్లలో స్థానికంగా సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మించాలన్న కుటుంబ ఆశయం ప్రశంసనీయమని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. రాంబిల్లి మండలం లాలం కోడూరులో సోమవారం నిర్వహించిన భాస్కరరావు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన తాను 1999లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసినప్పుడు స్థానికేతరుడినని ప్రత్యర్థులు ప్రచారం ప్రారంభించగా,భాస్కరరావు లాలంకోడూరు గ్రామం తరపున దత్తత తీసుకోవడం ద్వారా రాజకీయాల్లో తనకు స్థానికత కల్పించారని పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన భాస్కరరావు ఆశయ సాధనకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.పలువురు డాక్టర్లను ఈ సందర్భంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పప్పల చలపతిరావు,ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు,జిల్లా పరిషత మాజీ చైర్ పర్సన్ లాలం భవానీ తదితరులు పాల్గొన్నారు.