
నేడు సావిత్రిబాయి పూలే వర్థంతి
తరతరాల చీకటిని తరిమి వెలుతురై ఉదయించిన అఖండ అక్షర జ్యోతి, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే.."
ఎం శ్రీను దేవుని బండ తండ సిపిఐ పార్టీ సర్పంచ్
( పయనించే సూర్యుడు మార్చి 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
దేవుని బండ తండా గ్రామపంచాయతీలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దేవుని బండ తండా సర్పంచ్ ఎం శ్రీను మాట్లాడుతూ అవమానాలను ధిక్కరించి అణగారిన ఆడపిల్లలకు అక్షరాలు నేర్పించిన భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, విద్యతోనే వనితకు విముక్తి సాధ్యమన్న సామాజిక ఉద్యమకారిణి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సంఘ సంస్కర్త, రచయిత్రి, స్త్రీల విద్య అభివృద్ధికి కృషిచేసిన దారిదీపం, విద్య క్రాంతి రేఖ సావిత్రిబాయి పూలే కు విప్లవ జోహార్లు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటిగా బ్రాహ్మణీయ కులతత్వ సంస్కృతి మత వ్యవస్థల పై యుద్ధం ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రీ బాయి..!! సామాజిక మార్పుకి, చైతన్యానికి, లింగ సమానత్వానికి విద్యనే ఆయుధమని భావించి మహిళా వెనుకబాటుకు విద్యలేకపోవడమే కారణమని గ్రహించి, విద్యావ్యాప్తికి అజన్మాంతం కృషి చేసిన గొప్ప మహనీయురాలు ..!! మహిళ హక్కులే మానవహక్కులని నినదించి దాడులు,వివక్షతను,అవమానాలు,అడ్డంకులు, అనేక అవరోధాలను సైతం ఎదుర్కొంటు సనాతన, ఛాందస, మత, సాంఘీక మూఢ దూరచారాల నిర్ములనకై ఉద్యమించిన సామాజిక వైతాళికురాలు సావిత్రి భాయి పూలే
భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా, రచయితగా,సంఘసంస్కర్తగా సమాజ అభ్యున్నతి కోసం - సమసమాజ స్థాపన కోసం ఆమె చేసిన త్యాగం, నడిపిన పోరాటం చారిత్రాత్మకం..స్త్రీ జాతి ఆణిముత్యం కరుడుగట్టిన బ్రాహ్మణిజం కబంధహస్తాల నుంచి స్త్రీ జాతి విముక్తి కల్పించిన మహా సంకల్పి మాతృమూర్తి…స్త్రీ బయటకు వెళ్లాలంటే పరదా వేసుకోవాలని శాసించిన సమాజాన్ని చీల్చి సమస్త భారత మహిళా లోకానికి స్వేచ్ఛా, స్వాతంత్రాలు ప్రసాదించిన మానవి సావిత్రిబాయి.. ఈ కార్యక్రమంలో దేవుని బండ తండ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ బాదావత్ శ్యామ్ లాల్ గారు గ్రామ సెక్రెటరీ గీతా గారు వార్డు సభ్యులు మారు వాలి గ్రామ పెద్దలు బాదావత్ శంకర్ లక్ష్మణ్ గ్రామ అంగన్వాడీ టీచర్ సుమతి మరియు గ్రామ యువకులు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు