లోకల్ గైడ్ దినపత్రిక సేవలు అమోఘం.
ప్రజలకు ప్రభుత్వలకు వారధి మీడియా.
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపలి శంకర్.
లోకల్ గైడ్ దినపత్రిక 2025 క్యాలెండర్ ఆవిష్కరించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 05 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్)నిజాలను నిర్భయంగా వెలికి తీసి ప్రజల ముందుంచే విధంగా పాత్రికేయులు పనిచేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజా సమస్యలను వెలికి తీయడం లో ముందుండాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లోకల్ గైడ్ న్యూస్ 2025 క్యాలెండరు ను ఆవిష్కరించారు. ఈ క్యాలెండరు ఆవిష్కరణలో రిపోర్టర్ రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలను నిరంతరం ప్రజా సమస్యలను అన్వేషిస్తూ వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో తో పాటు ఎమ్మెల్యేగా నేను చేస్తున్న అభివృద్ధి అభివృద్ధి పై దృష్టి ఉంచి ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజలకు నిరంతర అన్వేషిగా కొనసాగుతున్న లోకల్ పత్రిక ఆవిష్కరించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా విశేషమైన పాత్ర పోషిస్తుందని అందులో భాగంగానే లోకల్ గైడ్ దినపత్రిక సమాజ సేవకు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూ అమోఘమైన సేవలు అందిస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. బుధవారం ఈమెరకు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కన్నుల పండుగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనతి కాలంలోనే లోకల్ గైడ్ దినపత్రిక ప్రజాభిమానాన్ని చూరగొందని కొనియాడారు. సమాజ హితం కోసం స్థాపించబడిన లోకల్ గైడ్ ద్విభాష దినపత్రిక భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు తన చేతుల మీదుగా లోకల్ గైడ్ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరింపజేయడం ఎమ్మెల్యే శుభాభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లోకల్ గైడ్ దినపత్రిక షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి రమేష్ భాస్కర్ రవి సాయిరెడ్డి రాములు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.