పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఇల్లందు పట్టణములో ఉన్న అన్ని మసీదుల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు మానవ హారం నిర్వహించారు. అందులో భాగంగా జామా మసీదు నుండి ప్రదర్శనగా వచ్చి పాత బస్టాండ్ మెయిన్ రోడ్ పై పెద్ద ఎత్తున భారీ మానవహారంగా ఏర్పడి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచనలతో వక్ఫ్ సవరణ చట్టం2025 కు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు పట్టణంలో మానవహారం నిర్వహించారు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు, మైనారిటీ సంఘాల జేఏసీ నాయకులు ముస్లిం కమిటీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు. శుక్రవారం నిర్వహించిన మానవహారం కార్యక్రమంలో ఇల్లందు పట్టణ ముస్లిం మత పెద్దలు మరియు కాంగ్రెస్ , బీఆర్ఎస్, సీపిఎం, సీపీఐ, రాజకీయ పార్టీల నాయకులు ముస్లిం యువకులు పాల్గొని విజయవంతం చేసినారు.