పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ది 09.04.2025
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు లో సందర్బంగా వడ దెబ్బ లక్షణాలు,తీసుకోవలసిన జాగ్రతల గురించి ప్రాజెక్ట్ అధికారి గారు మాట్లాడుతూ వేసవి కాలంలో అధిక ఉష్నో గ్రతలు, వేడి గాలుల వలన వడ దెబ్బ సోకి డి హైడ్రేషన్ కలిగే అవకాశం ఉన్నదని, సరియైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణంతక సంఘటనలు జరగవచ్చని తెలియ చేసినారు తీసుకోవలసిన జాగ్రత్త లు మాట్లాడుతూ వేసవి కాలంలో తగు మోతాదు లో నీరు,పళ్ళ రసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను, రోజు కనీసం 15గ్లాసుల నీరు త్రాగలని, ఎండ వేళలో ఇంట్లోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళ రాదని, ఒకవేళ వెళ్లినా తలపాగా,టోపీ, లేదా గొడుగు వంటి ఉపయోగించాలని తెలియ చేశారు. వడ దెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చాలని, చల్లని నీటిలో ముంచిన తడి గుడ్డ తో శరీరం తుడవాలని, ఫ్యాన్, చల్లని గాలి తగలాలని, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ ద్రావణం లేదా ORS ద్రావణ్ణి త్రాగించాలని, వడ దెబ్బ తగిలిన వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నపుడు నీరు త్రాగించరాదు. వీలైనంత త్వరగా వడ దెబ్బ తగిలిన వ్యక్తి ని దగ్గర లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని ప్రజలకు తెలియ చేసినారు. అదేవిదంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రలలో,ఆరోగ్య ఉప కేంద్రాలలో ORS పాకెట్స్ అందుబాటులో ఉంటాయాని, వాటిని కూడా ఉపయోగించాలని తెలిపినారు. ఈ కార్యక్రమం లో APO శ్రీ జగన్నాధ రావు, . Dy DM&HO Dr. పుల్లయ్య గారు, డివిజనల్ ఇంజనీర్ శ్రీ మురళి గారు, ITDA AO రాజ్ కుమార్ గారు, చింతూరు CDPO విజయ గౌరి గారు తదితరులు పాల్గొన్నారు