
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్ బి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించినటువంటి బాల చెలిమి కథల పోటీలలో వన్నెల్ (బి) పాఠశాల విద్యార్థులు నవిజ , అల్ఫియా, రితిక, లహరి, మనుష్ , దేవీప్రియ, అశ్విత్, శివసాయి, భవ్య శ్రీ, హారిక ప్రతిభను కనబరిచారని, నవిజ , భవ్య శ్రీ రాసిన కథలు కథా పుస్తకాలలో ముద్రితమయ్యాయని పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు వివేకవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ సర్పంచ్ బక్కూరి వినోద ఉప సర్పంచ్ బక్కూరి భూమేశ్వర్ విద్యార్థులను అభినందించారు.