మంచిర్యాలలో కరపత్రాల పంపిణీ చేసిన బీసీ నాయకులు
పయనించే సూర్యుడు జనవరి 31
మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్
రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్)
ఫిబ్రవరి రెండున వరంగల్ నగరంలో జరగనున్న బీసీ యుద్ధభేరి సభను మంచిర్యాల జిల్లా బీసీ బిడ్డలందరూ విజయవంతం చేయాలని బీసీ ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంచిర్యాలలో వారు కరపత్రాల పంపిణీ చేపట్టారు. బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య ప్రసంగిస్తూ ఆదివారం రోజున వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే బీసీ యుద్ధభేరి సభ ద్వారా బీసీల హక్కుల పత్రాన్ని బీసీ నాయకులు ఆవిష్కరించనున్నారని తెలిపారు. భారతదేశ జనాభాలో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీల హక్కులని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జాతీయస్థాయి కులగణన చేపట్టాలనే బీసీల డిమాండును నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇకనైనా ఒప్పుకోవాలని కోరారు. మహాత్మ ఫూలే చూపిన బాటలో తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యమించి పోరాడడానికి బీసీ వర్గాలుఅఇక సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీల రిజర్వేషన్లు కేటాయించాకనే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు పోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ ఐక్యవేదిక జిల్లా కమిటీ సభ్యులు చలమల్ల అంజయ్య, బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి నాయకులు మోతే రామదాసు, సీనియర్ న్యాయవాది పేరం రాజయ్య, బీసీ నాయకులు మొగిళి తిరుపతి, వడ్డే రాజమౌళి, రవూఫ్ పాల్గొన్నారు