నాన్ స్టాప్ కార్యక్రమాలతో 32 ప్రపంచ రికార్డులు సాధించిన ఏకైక సాహిత్య సంస్థ.
నిరంతర సాహితీ కార్యక్రమాలతో ప్రపంచంలోనే అతి పెద్ద సాహిత్య సంస్థగా పేరొంది సాహిత్య చరిత్రలో ప్రభంజనం సృష్టిస్తున్న ISO గుర్తింపు పొంది తెలుగు భాష - తెలుగు సంస్కృతి తెలుగు వైభవం- తెలుగు సాహిత్యం - తెలుగు కళలు పరిరక్షణ కోసం నిరంతరాయంగా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలతో ప్రభంజనం సృష్టిస్తున్న శ్రీశ్రీ కళావేదిక మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రైటర్స్ ఫోరం, వరల్డ్ పోయెట్రీ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే యువ తేజం జాతీయ యువ ప్రతిభా పురస్కారానికి స్థానిక కవి, రచయిత నూనె రమేష్ కు ఆహ్వానం అందినట్లు ఒక ప్రకటనలో తెలియజేసారు. సాహిత్య రంగంలో చేస్తున్న సేవలను గుర్తించి జనవరి 21 మంగళవారం- 2025 విజయవాడ నందు జరిగే కార్యక్రమం లో పాల్గొనవలసిందిగా నిర్వాహకులు కోరినట్లు తెలియజేసారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సంయుక్తం గా నిర్వహిస్తున్న ఇంతటి గొప్ప సాహితీ కార్యక్రమానికి ఆహ్వానం అందడం పట్ల కవి నూనె రమేష్, తల్లిదండ్రులు నూనె అజరయ్య శాంతి మరియు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేసారు.