విజయ కార్డియాక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం
డాక్టర్ చందులాల్ రాథోడ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహణ
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని విజయ కార్డియాక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవం ( వరల్డ్ హార్ట్ డే ) సందర్భంగా గుండె సంబంధిత వ్యాధులకు ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో షాద్నగర్ నియోజకవర్గం లోని ప్రజలు భారీగా పాల్గొని తమ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలను చేయించుకోవడం జరిగింది. ఈసిజి , 2 డీ ఈసిహెచ్ ఓ 400 మంది కి మరియు బిపి షుగర్ టెస్టులు మరో నాలుగు వందల మందికి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విజయ కార్డియాక్ హాస్పిటల్ డాక్టర్ చందులాల్ రాథోడ్ మాట్లాడుతూ… ప్రజలు తమ యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న పొరపాటు చేయకుండా ఇప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకుంటూ తమ యొక్క ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.