పయనించే సూర్యుడు ఏప్రిల్ 17 ఇల్లందు ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీలోవరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం, కనకయ్య ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులకు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు 500 రూపాయలు భువనసిస్తున్నామని, దొడ్డు వడ్లకు రూపాయలు 2320 ఇస్తున్నట్లు తెలిపారు. రైతులందరూ దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వ నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. పేదలకు, రైతాంగానికి మేలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతు రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని, దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి రెండు లక్షల రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం చేసిందని గుర్తు చేశారు. గతంలో పనిచేసిన ప్రభుత్వానికి రైతుల పట్ల, పేదల పట్ల చిత్తశుద్ధి లేదని టిఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పేదలను గాని రైతాంగాన్ని గాని, పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మహిళ నాయకులు బానోత్ శారద, పి ఎ సి ఎస్ చైర్మన్ మెట్ల కృష్ణ, తాటి బిక్షం, కిన్నర్ నరసన్న, పోటు రవి, వల్లాల కొమరయ్య, బానోత్ జింకు, బింగి కృష్ణ, సోమ్లా, శ్రీరాములు, ముత్యాలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.