పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి సెప్టెంబర్ 11
అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు, మండలం, చట్టి గ్రామపంచాయతీలో రైతులు వరి నాట్లు వేసిన తర్వాత వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూసే రోజులు పోయి ఇప్పుడు నాట్లు వేసి యూరియా బస్తాలు ఎప్పుడు వస్తాయని ఎదురుచూసే పరిస్థితి, గ్రామాలలో ప్రతి ఒక్క రైతు వరి నాట్లు వేసి ఒకపక్క వరదల భయం మరోపక్క యూరియా దొరక రైతులు పడుతున్న బాధలు వర్ణాతితం కాబట్టి సంబంధిత అధికారులు ఎప్పటికైనా స్పందించి రైతు బాధలు అర్థం చేసుకొని తక్షణమే చట్టి గ్రామపంచాయతీకి యూరియా బస్తాలు సరఫరా వచ్చే విధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని గ్రామపంచాయతీ కార్యదర్శ వారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చట్టి గ్రామ పెసా కార్యదర్శి పోడియం. రామకృష్ణ గ్రామ రైతులు తుర్రం.వెంకటరామయ్య, రవ్వ. నాగేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.