
బ్రహ్మయ్య వర్గాన్ని టార్గెట్ చేసిన అధికార వర్గం
పంచాయతీ లో బ్రహ్మయ్య వర్గానికి తిరుగులేని ఆధిపత్యం -
మండల కాంగ్రెస్ కు పెద్ద దిక్కైన తుళ్లూరి బ్రహ్మయ్య
పయనించే సూర్యుడు, డిసెంబర్ 12, అశ్వాపురం
. అశ్వాపురం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో వర్గ పోరు ఉన్న తుళ్లూరి బ్రహ్మయ్య వర్గం పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యం చూయించి మండల కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా మారింది. అశ్వాపురం పంచాయతీలో 16 వార్డులు 1 సర్పంచ్ కు 15 వార్డులు 1సర్పంచ్ లను గెలిపించుకొని తుళ్లూరు బ్రహ్మయ్య మరొకసారి తన చరిష్మాను ఇటు పంచాయతీలో అటు మండల వ్యాప్తంగా కనబరిచారు.ఆది నుంచి అశ్వాపురం మండలంలో బ్రహ్మయ్య వర్గానికి,అధికార వర్గానికి పోసకడం లేదు వారు ఏది చేసినా వీరు వీరు ఏది చేసినా వారు అనే రీతిలో మండలంలో ఎన్నికల్లో కాంగ్రెస్‌లో వర్గ పోరు మళ్లీ వెలుగుచూసింది.స్థానిక నాయకుల మధ్య పెరిగిన భేదాభిప్రాయాలు పార్టీ ఏకతను దెబ్బతీశాయని చెప్పవచ్చుఅభ్యర్థుల ఎంపికలో జరిగిన అసమ్మతి వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బ్రహ్మయ్య వర్గం నిర్ణయాలను అధికార వర్గం బహిరంగంగా ప్రశ్నించడం ప్రారంభించింది.అంతర్గత కలహాలతో సాధారణ కార్యకర్తల్లో కూడా అసంతృప్తిని పెంచాయి.అభ్యర్థుల ప్రచారంలో కూడా అధికార వర్గం బ్రహ్మయ్య వర్గానికి సహకరించకుండా దూరంగా నిలిచింది.ఈ నేపథ్యంలో బ్రహ్మయ్య వర్గం పై కొంతమంది నాయకులు వ్యతిరేకత, ఒత్తిడి కోసం వ్యూహాలు రచించినట్లు ప్రచారం జరిగింది.ఫలితంగా, కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను ప్రభావితం చేసే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.పార్టీ అంతర్గత విభేదాలను తీర్చేందుకు ఉన్నత నాయకత్వం జోక్యం చేసుకోవాలని అనుకుంది కానీ అక్కడ బ్రహ్మయ్య వర్గం ఉండటంతో వారిలో ఎటువంటి జోక్యం చేసుకోలేకపోయింది.అయితే అధికార వర్గం చేసిన ప్రయత్నాలలో ఆ స్థాయిలో విభేదాలు తగ్గే సూచనలు కనిపించలేదు.చాలా మంది కార్యకర్తలు పార్టీ ఏకత కంటే వర్గ ప్రయోజనాలను ముందుకు పెడుతున్నారని ఆరోపణలు వినిపించాయి.ఈ పరిస్థితుల్లో ఓటింగ్ సమయంలో ‘క్రాస్ ఓటింగ్’ జరిగే అవకాశాలపై ఆందోళన వ్యక్తమైంది. పంచాయతీలో అధికార వర్గం అసంతృప్తితో బ్రహ్మయ్య వర్గాన్ని బలహీనపరచడానికి క్రాస్ ఓటింగ్‌కు ప్రోత్సహించినట్లు సమాచారం వెలువడింది.క్రాస్ ఓటింగ్ జరిగితే బ్రహ్మయ్య వర్గంలోని అభ్యర్థుల గెలుపు అవకాశాలు దెబ్బతీయచ్చుని పన్నాగం పన్నింది.వర్గ పోరు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక నాయకత్వం పార్టీ ఐక్యత కోసం శాసనసభ్యులు పాయం తక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించలేదు. కానీ ఒంటి చేత్తో ప్రచారంలోకి దిగిన బ్రహ్మయ్య వర్గం నిలబడి పోరాడి గెలిచి అశ్వాపురం పంచాయతీలో బ్రహ్మయ్యకు తిరుగులేని శక్తిగా మండలంలో అందరికీ ఆయనే పెద్ద దిక్కుగా అశ్వాపురం మండల కాంగ్రెస్ రాజకీయం మారిపోయింది.