//పయనించే సూర్యుడు// సెప్టెంబర్11//మక్తల్
నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం మద్వార్ గ్రామానికి చెందిన అజయ్ కృష్ణ 7 వర్ధంతి పురస్కరించుకొని గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు పద్మమ్మ, బాలకిషన్, స్నేహితులు కిష్ట గౌడ్,ఆయా పాఠశాలల ఉపాధ్యాయ బృందం, చిన్నారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.