పయనించే సూర్యుడు: జనవరి 17: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి,రామ్మూర్తి.ఎ.... వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాలరావు ఆదేశాల మేరకు వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆయా గ్రామాలలోనీ ఆశా కార్యకర్తలు జ్వరం, దగ్గు, ఆకలి మందగించుట, బరువు తగ్గుట వంటి లక్షణాలు ఉన్నవారిని వ్యాధి నిర్ధారణ పరీక్షలకు తీసుకురావడం జరిగింది. ఈ శిబిరంలో 30 మంద కి తెమడ సేకరణ తీసుకోవడం జరిగిందనీ వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కొమరం మహేందర్ తెలియజేశారు.అనంతరం వాటి నమూనాలను టి యు వెంకటాపురం ల్యాబ్ కు తీసుకెళ్లడం జరుగుతుందని వెల్లడించారు. మరియు శిబిరానికి వచ్చిన
ప్రజలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించడం జరిగిందనీ వాజేడు వైద్యాధికారి కొమరం మహేందర్ వెల్లడించారు. మధుమేహం ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా క్షయ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని శీతాకాలపు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామాలలో వీధి కుక్కల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాజేడు వైద్యాధికారి కొమరం మహేందర్, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్, రజినీకాంత్, రవి మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.