పయనించే సూర్యుడు జనవరి 23 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- ఎన్నికల సమారోహ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసిన వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ శేఖర్ జె ఎన్ టి యుసి కుత్బుల్లాపూర్ డివిజన్ ఆఫీస్ ప్రాంగణంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్నికల సమారోహ సభ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వాటర్ వర్క్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కె. రాజిరెడ్డి, కార్యవర్గ సభ్యులు జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు సి. సతీష్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు భారీ ఎత్తున పాల్గొని త్రిశూలం గుర్తుకే మన ఓటు అని నినాదాలు చేస్తూ, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల గురించి, భవిష్యత్తు కార్యాచరణ పై పలువురు నాయకులు వివరిస్తూ సభను కొనసాగించారు, అదేవిధంగా ఈ సభకు తరలివచ్చిన యూనియన్ నాయకులకు, సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసిన వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ శేఖర్. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు