భద్రాచలం నియోజకవర్గ బిఎస్పి సోషల్ మీడియా ఇంచార్జ్ జనగం కేశవరావు. పయనించేసూర్యుడు: ఫిబ్రవరి22 ;ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ. వాజేడు: భద్రాచలం నియోజకవర్గం పరిధిలోగల , ఏదిర గ్రామ సమీపంలో గల రాళ్లవాగు,పాత్రాపురం సమీపంలోని బల్లకట్టు వాగు, ఆలుబాక కొండాపురం గ్రామాల మధ్యనున్న వాగులకు సంబంధించిన బ్రిడ్జిలను పూర్తిగా తొలగించి కొత్త నిర్మాణాలను చేపట్టాలని భద్రాచలం నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జనగం కేశవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేశవరావు మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గంలో అత్యధికముగా అన్ని మల్టీ స్పెషాలిటీలతో ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలతో ఆసుపత్రిలు, మహా పుణ్యక్షేత్రాలుగా పిలుచుకునే పర్ణశాల, భద్రాచల సీతారామయ్య గుడి ఉండగా భక్తులు,,రోగులు మూడు రాష్ట్రాల ప్రజలు అనగా మహారాష్ట్ర,చతిస్గడ్, తెలంగాణ,అని,కుల,మత, ప్రాంత విభేదాలు లేకుండా తరచుగా వెంకటాపురం మీదుగా చర్ల నుండి భద్రాచలానికి ప్రయాణం చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. అయితే ఈ రోడ్డు గత మూడేళ్లుగా అధిక వర్షాలు కురవడం వలన గోదావరి ముంపు ప్రాంతమైన భద్రాచలం ఏజెన్సీ రోడ్లు అన్నీ కూడా పూర్తిస్థాయిలో ధ్వంసానికి గురయ్యాయి. అందుచేత మూడు రాష్ట్రాల కు చెందిన ప్రజలు రోడ్డు మరమ్మత్తులు చేపట్టి కిందకు కృంగిన బ్రిడ్జిలు అన్నింటిని పూర్తిస్థాయిలో తొలగించి నూతనంగా నిర్మించారని కోరుతున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే నియోజకవర్గ అభివృద్ధి పనులను మొదలుపెట్టి ఇందులో భాగంగా రోడ్లు. వంతెనల నిర్మాణాలు శరవేగంగా చేయాలని ప్రార్థిస్తున్నారని జనగం కేశవరావు అన్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు యంత్రాంగం మేలుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్ల నిర్మాణాలు చేపట్టి అదేవిధంగా వంతెనలు నిర్మించాలని ఈ సందర్భంగా ప్రజల తరఫున వేడుకుంటున్నానని తెలిపారు.