పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 23:- రిపోర్టర్( కే శివకృష్ణ ) బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని వార్డుల నందు ఈ రోజు ఉదయం నుండి మునిసిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డి పర్యటించారు.ఆర్ట్స్ కాలేజీ మరియు చీలు రోడ్డు వద్ద పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతూ ప్రతిరోజు వార్డుల నందు నిర్వహించే పారిశుద్ధ్యయం విషయమై వారికి కొన్ని సూచనలు చేశారు. పారిశుద్ధ్యం విషయంలో అలసత్వం వహించవద్దని కార్మికులకు సూచించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లతో మాట్లాడుతూ దోమల నివారణకు ప్రతిరోజు ఫాగింగ్ తప్పనిసరిగా చేయాలన్నారు. ప్రతిరోజు కూడా ప్రజలు పారిశుద్ధ కార్మికులకు అందించే చెత్తను తడి చెత్త పొడి చెత్త మరియు హానికర వ్యర్ధాలుగా వేరు చేసేలా వారికి అవగాహన కల్పించాలన్నారు.రోడ్లు మార్జిన్ ల నందు ఎక్కడ కూడా చెత్త నిల్వలు లేకుండా చూడాలన్నారు.జి.బి.సి రోడ్డు నందు నీటి పైపులైను లీకేజీని గుర్తించి సత్వరమే దాన్ని బాగు చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మున్నం వారి పాలెం నందు నీటి సరఫరా విషయమై నేరుగా గృహాల వద్దకు వెళ్లి యజమానులతో మాట్లాడారు.ప్రతిరోజు నీటి సరఫరా సక్రమంగా జరుగుతుందో లేదో, ఇబ్బందులు ఉన్నవో వారినే వివరాలు అడిగి తెలుసుకున్నారు. దిగువ ప్రాంతాలకు ప్రతిరోజు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా తప్పకుండా చేయాల్సిందేనని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. వారి వెంట పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ సిబ్బంది ఉన్నారు.