
పయనించే సూర్యుడు జనవరి 30 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజుఉదయం 9:45 గంటలకు వాసవి క్లబ్ మరియు వాసవి క్లబ్ వనిత, సూళ్లూరుపేట వారి ఆధ్వర్యంలో బస్ స్టాండ్ దగ్గర గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమములో అంతర్జాతీయ అదనపు కోశాధికారి బండారు శబరీష్ గుప్తా, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సాయిరాం, వాసవి క్లబ్ అధ్యక్షులు గణేష్, కార్యదర్శి బాల కృష్ణ, వనితా క్లబ్ అధ్యక్షురాలు సౌజన్య , కార్యదర్శి గౌతమి, మాజీ జోన్ చైర్మన్ పద్మజ, వనితా క్లబ్ గత అధ్యక్షురాలు నిర్మల కుమారి, వాసవీ క్లబ్ గత కార్యదర్శి పైడిమర్రి కిషోర్, సభ్యులు కారంశెట్టి శ్రీనివాసులు, పాదర్తి చెంచయ్య తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు
