
కార్యాలయం ఎదుట నిలిపి ఉంచిన వాహనాలు..
రుద్రూర్, జూలై 19 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద ఉన్న సమీకృత మండల కార్యాలయ భవనం వాహనాలు పార్కింగ్ కు అడ్డాగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. కార్యాలయం ఎదుట వాహనాలను పార్కింగ్ చేయడం వలన వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాహనాలను కార్యాలయం ఆవరణలో పార్కింగ్ చేసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.