పయనించే సూర్యుడ న్యూస్(జూలై.7/07/2025) తిరుపతి జిల్లా స్టాప్ రిపోర్టర్ యుగంధర్
తిరుపతి జిల్లా సత్యవేడులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభమయ్యాయి.రాష్ట్రంలో జూలై 1 నుంచి సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం ప్రారంభం కాగా సత్యవేడులో వేగంగా మారిన రాజకీయ పరిణామాలు నేపథ్యంలో వారం పాటు జాప్యం నెలకొంది. అయితే పార్టీ పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి,పార్టీ కార్యక్రమాలు సజావుగా సాగడానికి నియోజకవర్గ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్గా కూరపాటి శంకర్ రెడ్డి నియమితులయ్యారు.దీంతో రాష్ట్ర రెవిన్యూ,జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాన సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి పరిచయ వేదిక నిర్వహించారు.
ఈ కార్యక్రమం ముగియగానే నియోజకవర్గ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి సరాసరి వెంకటరాజుల కండ్రి గ్రామానికి చేరుకుని సుపరిపాలలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్య అతిథులుగా టిడిపి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్,డాక్టర్ శ్రీపతి బాబు,పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి,మాజీ అధ్యక్షులు పరమశివం తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామానికి ప్రవేశించగానే ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డికి ఘన స్వాగతం పలికి మహిళలు పెద్ద ఎత్తున పుష్పాలు వెదజల్లారు.ఈ క్రమంలో పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి గత ఏడాదిగా ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.రాబోవు కాలంలో ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మురళి( చికెన్ చిన్న)జడేరిబాబు,శశి మోహన్ నాయుడు,ప్రభాకర్ రెడ్డి,మనీ,దయ గ్రామస్తులు పలువురు తదితరులు పాల్గొన్నారు.