రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం ఇప్పలపల్లి గ్రామంలోని విఐపి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఏఐఎంఎస్ ఒలంపియాడ్ హంట్ 2024- 25 సంబంధించి జరిగిన ఎగ్జామ్స్ లో విఐపి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పాల్గొని నేషనల్ ర్యాంకులు సాధించారు. వీరిలో పి ఆద్య ( ఒకటో తరగతి) నేషనల్ ఎనిమిదో ర్యాంక్ మరియు కే సాయి చరణ్ ( 5వ తరగతి ) జోనల్ 7 వ ర్యాంక్ , టీ శశాంక్ వర్మ (6వ తరగతి ) జోనల్ టెన్త్ ర్యాంక్ సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించి మెడల్స్ సర్టిఫికెట్స్ బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ వెంకటకృష్ణ మరియు సౌమ్య తదితరులు పాల్గొన్నారు