వృదులకు, వితంతువులకు, ఒంటరి మహిళా లకు 4000/- పింఛన్లు పెంచాలి.
పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు కొండాపూర్ మండల్ సంగారెడ్డి జిల్లా 16 సెప్టెంబర్ 2025
కొండాపూర్ మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ఎం ఆర్ పి ఎస్ అనుబంధం సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండల్ కేంద్రం నందు ధర్నా చేసిన అనంతరం ఎం ఆర్ ఓ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వి హెచ్ పి ఎస్ జిల్లా కన్వీనర్ దేవరంపల్లి అశోక్, వి హెచ్ పి ఎస్ నాయకులు ఆకుల పెద్ద వెంకటేశం, వెంకన్న,షేక్ ముజిబ్, కిషన్, పుల్లయ్య,ఎం ఆర్ పి ఎస్ సీనియర్ నాయకులు సడాకుల కృష్ణ మాదిగ, జార్జ్, రాములు, తదితరులు పాల్గొన్నారు.