---- బోధన్ ఎమ్మార్వో కు వినతి పత్రం
------ వినతి పత్రం అందజేస్తున్న వికలాంగుల హక్కుల జాతీయ అధ్యక్షులు సుజాత సూర్యవంశీ
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సోమవారం వి హెచ్ పి ఎస్, ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి చేసి ఎమ్మార్వో విట్టల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ..వికలాంగులకు 6000/- రు, పెన్షన్,వృద్ధులు వితంతువులు,బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులకు 4000/- రు, పెన్షన్ పెంచాలని, కండరాల క్షీణ వారికి 15000/ఇవ్వాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6000 /- పెంచుతామని అలాగే వృద్ధులు,వితంతువులు, ఒంటరిమహిళలకు,బీడీ కార్మికులకు 4000 పింఛను పెంచుతా మని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచిన మాట ప్రకారం పింఛను పెంచకుండ మోసం చేస్తున్నారు.చేయూత పింఛను పెంచుతానన్నా రేవంత్ రెడ్డి మాటను నిలబెట్టుకోకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చేయుత పింఛన్లను పెంచకపోయిన, కొత్త పింఛన్లను మంజూరు చేయకపోయినా, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య వి హెచ్ పి ఎస్ మండల నాయకురాలు చందన, సైదయ్య, ధర్మయ్య, సావిత్రి,మాధవరావు, లక్ష్మి, పర్వీన్, తదితరులు పాల్గొన్నారు.