
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 21 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ వద్ది రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో లో వికసిత్ భారత్ జీ గ్యారంటీ రామ్ జీ పథకం గురించి అవగాహన కోసం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గారు బిజెపి పార్టీ నేతలు, అడిషనల్ ప్రోగ్రాం అధికారి మదిలేటి ఎం.పీ.డీ.వో వీర్రాజ్ హౌసింగ్. ఏ.ఈ లోకేష్ కుమార్ .ఈశ్వర్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా వికసిత్ భారత్ జీ గ్యారంటీ రామ్ జీ పథకం పేదలకు వరం లాంటింది, ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద కుటుంబం నుంచి పుట్టాడు కాబట్టి పేదలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నాడు, గ్రామీణ ప్రజలకు ఏడాదికి 125 పని దినాలు ఉపాధి కల్పించాడు గత కాంగ్రెస్ పార్టీ 100 రోజులు మాత్రమే కల్పించింది, అవినీతిని కట్టడి చేసేందుకు కూలీలు పని చేసే చోట హాజరు నుండి జీతం చెల్లింపు వరకు అంత డిజిటల్ బయోమెట్రిక్ విధానం,అదే విధంగా వ్యవసాయ సీజన్లో కూలీల కొరతను తీర్చడం ద్వారా రైతులకు ఉపశమనం కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా కార్యవర్గ సభ్యురాలు పండు లక్ష్మీదేవి మురళీకృష్ణ . కేత వెంకటరమణ .రంగస్వామి. జక్కరామయ్య. కిట్టు పాల్గొన్నారు
