పయనించే సూర్యుడు కౌతాళం రిపోర్టర్ వంశీజగన్ కౌతాళం మండలం నదిచాగి గ్రామంలో నూతనంగా ప్రతిష్టాపన చేసిన దుర్గాదేవి మరియు నరసమ్మ విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ శ్రీ ఎన్.రాఘవేంద్ర రెడ్డి గారు, కౌతాళం మండలం నాయకులు చూడి ఉలిగయ్య . ముందుగా గ్రామ నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికి విగ్రహ ప్రతిష్టాపనలో మంత్రాలయం నియోజకవర్గం లోని ప్రజలు, రైతులు,కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ బాగుండాలని పూజారులచేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరుకుందా గ్రామంలో ఉప ప్రధాన అర్చకులు పూజన్న స్వామి కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చూడి సురేష్ నాయుడు , అడివప్ప గౌడ్ గారు,వెంకటపతి రాజు , చూడి శివ ,డాక్టర్ రాజానందన్ కుంబులూరు క్యాంపు చిన్న, రామలింగ బసవరాజు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.