
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్22(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి గ్రామంలో విజన్ హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఆయనచిత్రపటానికి గణిత ఉపాధ్యాయులచే పూలమాలవేసి నివాళులర్పించారు.రామానుజన్ అతి చిన్న వయసులోనే గణితం పట్ల అసాధారణ ప్రతిభ కనబరిచి, భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు ఇనుమడింపజేశారని, ఆయన రాసిన పుస్తకాలలోని సమస్యల కు సమాధానం కనుక్కోవడానికి ఇప్పటి శాస్త్రజ్ఞులకు కూడ కష్టతరమని, దీనిని బట్టి ఆయన మేధో సంపత్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని వివరించడం జరిగింది.గణితం గురించి యాక్టివిటిల రూపంలో విజన్ విద్యార్థుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సందర్బంగాగణిత ఉపాధ్యాయులకు సన్మానంచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విజన్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

