పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 14(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల కేంద్రంలోని విజన్ విద్యాసంస్థల్లో ఘనంగా అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరిపారు. రాజ్యాంగ పితామహులు డా. బిఆర్. అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన కృషిని విద్యార్థులకు వివరిస్తూ మన రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం అనేక దేశాలు తిరిగి ఎంతో శ్రమకోర్చి అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది అని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనకు అత్యుత్తమ విధానాలతో కూడిన జీవన విధానం ను అమల్లోకి వచ్చేలా కృషి చేసిన మహనీయులను అందరినీ స్మరించుకోవడం జరిగింది అంబేద్కర్ గారు స్వేచ్చ, సమానత్వం ఎక్కడ లభిస్తుందో ఆ ప్రాంతం నాకు అత్యంత ఇష్టమైనదని తెలిపారు అని విజన్ కరెస్పాండంట్ విశ్వనాథ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విజన్ స్కూల్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.