
పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 10, శర్మాష్ వలి, మండల రిపోర్టర్ యాడికి :
స్థానిక విజన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా సంక్రాంతి సంబరాలు విజన్ విద్యార్థులు మరియు అతిధులు ఉపాధ్యాయుల సమక్షంలో జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా యాడికి పట్టణ సీఐ శ్రీనివాసులు విచ్చేసి సంక్రాంతి శోభను ఉట్టిపడేలా చేసిన కార్యక్రమాలను వీక్షించి విద్యార్థులకు విలువైన సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులు వేసిన రంగవల్లులను పరిశీలించి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది . అలాగే రంగవల్లుల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులను టిడిపి మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ బహుకరించారు. పట్టణ సీఐ శ్రీనివాసులు గారిని విజన్ కరస్పండెంట్ విశ్వం సన్మానించారు..ఈ కార్యక్రమంలో విజన్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు బొమ్మల కొలువు, పిట్టలదొర, హరిదాసు, డుడు బసవన్న క్యారెక్టర్స్ తల్లిదండ్రులు మరియు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో, టీడీపీ సీనియర్ నాయకులు రుద్రమ నాయుడు, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఆదినారాయణ, నాయకులు మధు రాజు, రామచంద్ర,రంగస్వామి, వెంకటస్వామి చంద్రశేఖర్ రెడ్డి, గుండా నారాయణస్వామి మరియు విజన్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

