
తిమ్మాజిపల్లి తండా ప్రాథమిక పాఠశాల సందర్శన
విద్యార్థులతో ముచ్చటించిన సర్పంచ్
( పయనించే సూర్యుడు ఆగస్టు 06 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల కడియాలకుంట గ్రామపంచాయతీ పరిధిలోని తిమ్మాజి పల్లి తండా లోని ప్రాథమిక పాఠశాలను కడియాల కుంట తండా సర్పంచ్ రాజు నాయక్ చౌహన్ సందర్శించడం జరిగింది. ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో వారి విద్యాభ్యాసం గురించి తెలుసుకోవడం మరియు పాఠశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు మరియు విద్యా ప్రమాణాలపై ఉపాధ్యాయులతో చర్చించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించాము. విద్యే సమాజ అభివృద్ధికి పునాది అని రాజు నాయక్ చౌహాన్ సర్పంచ్ అన్నారు.