( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తూ, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయుల పైనే వుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు అన్నారు.నేడు ఫరూఖ్ నగర్ ఎంపిడిఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఫరూఖ్ నగర్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి, వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని, వారు భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దుతున్నారని అన్నారు.విద్యారంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల విద్యాధికారి మనోహర్ ,ఎంపీడీఓ బన్సీ లాల్,మాజీ జడ్పీటీసీ వెంకట్ రాం రెడ్డి, నేతలు కృష్ణా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,రాజు ,అన్వర్, ఖదీర్, ముబారక్ అలీ ఖాన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.