పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాసరెడ్డి
నాసా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని హయత్ నగర్ ఎస్సై నరసింహ అన్నారు. గురువారం హయత్ నగర్ పరిధిలోని సాయి నగర్ శ్రీ చైతన్య స్కూల్లో నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ సెంటర్ అమెరికా వారు నిర్వహించిన నాసా పోటీల్లో సాయి నగర్ శ్రీ చైతన్య బ్రాంచ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి జ్ఞాపికలు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా హయత్ నగర్ ఎస్ఐ నరసింహ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు శ్రీ చైతన్య స్కూల్ ఏజీఎం సతీష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తున్నట్లు చెప్పారు జాతీయ స్థాయిలో రెండవ బహుమతి పొందడం పై సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ వెంకట్ రెడ్డి. ప్రిన్సిపాల్ అంజనేదేవి. కోఆర్డినేటర్ రఘువంశి. డీన్ రఘుపతి. సి బ్యాచ్ ఇంచార్జ్ సోమయ్య పాల్గొన్నారు