
రుద్రూర్ మండల లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు కారంగుల ప్రవీణ్ కుమార్..
రుద్రూర్, డిసెంబర్ 27 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని రుద్రూర్ మండల లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు కారంగుల ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎంబీబీఎస్ లో ఫ్రీ సీట్ సాధించిన జాకటి సుచిత్ర అక్బర్ నగర్, సాత్విక్ గౌడ్ రుద్రూర్, చల్లపల్లి సిరి కోటయ్య క్యాంపు ముగ్గురు విద్యార్థులను శనివారం కారంగుల ప్రవీణ్ కుమార్ వారి వారి నివాసంలో శాలువాతో ఘనంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్నారు. ఈ రోజుల్లో ఏదైనా సాధించాలి అంటే కేవలము చదువుతోనే సాధ్యమన్నారు. తల్లితండ్రులు అంతంత మాత్రమే చదువుకొని ఎన్నో కష్టాలతో జీవితాన్ని నడుపుతూ తమపిల్లలకు చదివించి వారిని ప్రయోజకులను చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని, ముగ్గురు విద్యార్థులు కఠోర విద్యాబ్యాసం చేస్తేనే వారికి ఎంబీబీఎస్ ఫ్రీ సీట్లు వరించాయని అన్నారు. వారు ఇంకా కష్టపడి రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని వారు తెలియజెశారు. ఈ సన్మాన కార్యక్రమంలో విద్యార్థుల తల్లి తండ్రులు ఉన్నారు.
