--- ఖమ్మం జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస రావు
----------------------------------------
పయనించే సూర్యుడు, జనవరి 30(వైరా నియోజకవర్గ రిపోర్టర్ ఆదూరి ఆనందం )ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు క్రమశిక్షణతో మంచి నడవడికతో, పట్టుదలతో చదివి జీవితంలో మంచి శిఖరాలకు చేరాలని ఖమ్మం జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస రావు తెలిపారు.
గురువారం వైరా పట్టణంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ ఎల్ నవీన్ జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ,ప్రభుత్వ జూనియర్ కళాశాల చదివే విద్యార్థులు తల్లిదండ్రులు చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతూ తమ పిల్లల చదివిస్తున్నారని తెలుపుతూ,
ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు చెడు స్నేహాలు మరియు సెల్ఫోన్ వంటి వాటికి దూరంగా ఉంటూ చెడు అలవాట్లు చెడు స్నేహాలు పట్టకుండా చాలా క్రమశిక్షణతో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసి తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు హితబోధ చేశారు.
ఈ సందర్భంగా స్థానిక వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2025 వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కుల సాధించిన వారికి తన వంతు కర్తవంగా ప్రైజ్ మనీ ప్రకటించడం జరిగింది. విద్యార్థులందరూ ఆదర్శ వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని వైరా కళాశాలకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎల్ నవీన్ జ్యోతి ,ఖమ్మం జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసరావుకి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బండి ఈశ్వర్, కళాశాల విద్యార్థిని ,విద్యార్థులు టీచింగ్, నాన్- టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.