
కడియాల కుంట తండా పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ మరియు డిప్యూటీ సర్పంచ్ తావు సింగ్ నాయక్
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా లోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు తమకు ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకొని విద్యార్థులకు బోధిస్తూ తమ యొక్క బోధన స్థితిని తెలుసుకోవడం జరిగింది. విద్యార్థులు ఉపాధ్యాయులుగా ప్రధానోపాధ్యాయులుగా వివిధ పాత్రలు ఎంతో ఘనంగా పోషించారు. ఈ కార్యక్రమంలో కడియాల కుంట తండా సర్పంచ్ రాజు నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు ఉన్నత స్థాయికి ఎదగాలని బాగా చదువుకొని తమ యొక్క తల్లిదండ్రులకు మంచి గుర్తింపుని తీసుకురావాలని తమకు ఎలాంటి అవసరాలు ఉన్న తమ ఉపాధ్యాయుల ద్వారా తనను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ ఉపాధ్యాయులు సత్యం, సరిత మరియు అంగన్వాడి టీచర్ సుజాత మరియు వార్డు సభ్యులు తావు సింగ్ నాయక్, చాట్ పట రవీందర్ నాయక్, ప్రియాంక దేవేందర్ నాయక్, దేవి రవి నాయక్, నీలా భాస్కర్ నాయక్, గోపి నాయక్, జ్యోతి రాజు నాయక్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
