విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేసిన మండల మాజీ వైస్ ఎంపీపీ మాచారం మౌనిక హరికృష్ణ గౌడ్..
( పయనించే సూర్యుడు మార్చి 5 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ )
ఫరూఖ్ నగర్ మండలం పరిధిలో బూర్గుల గ్రామంలో ప్రాథమీకోన్నత పాఠశాలలో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా మాజీ వైస్ ఎంపీపీ మాచారం మౌనిక హరికృష్ణ గౌడ్ హాజరై విద్యార్థులకు 90 ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు సంతోష్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు నర్సింలు,నాగేష్, యుగంధర్, తదితరులు పాల్గొన్నారు..