విఐపి స్కూల్లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
ముఖ్య అతిథిగా పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి
( పయనించే సూర్యుడు మార్చి 08 షాద్ నగర్ నియజకవర్గం ఇన్చార్జి మెగవత్ నరేందర్ నాయక్) షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలో విఐపి పబ్లిక్ స్కూల్ లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ మరియు కేశంపేట్ మాజీ జడ్పిటిసి విశాల శ్రవన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ
విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మాజీ జడ్పిటిసి మెమొంటో స్పందించడం జరిగింది అదే విధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు కూడా బహుమతులు అందించడం జరిగింది. మరియు ఉపాధ్యాయురాలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ మరియు నరేష్ మరియు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.