
పయనించి సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వసంత్ నగర్, కేపీహెచ్బీ 4వ ఫేజ్, కైతలాపూర్, రాఘవేంద్ర నగర్, ఆంజనేయ నగర్, మూసాపేట్ ప్రాంతాల్లోని గణేష్ మండపాలను సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని అందించారు.వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం కలగాలని బండి రమేష్ గణనాథుని ప్రార్థించారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.