
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ రామకృష్ణ వీధిలో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్, గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద భక్తిశ్రద్ధలతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్. చంద్రకాంతరావు హాజరై అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలను అందజేశారు. కార్యక్రమానికి స్థానిక నాయకులు, అసోసియేషన్ సభ్యులు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో తాండవ కృష్ణ, సంజీవరెడ్డి, డాక్టర్ వంశీ, నరసింహారావు, అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి, కార్యదర్శి రామచంద్రరావు, శ్రీధర్, లక్ష్మీనారాయణ, సుధాకర్, వెంకటేశ్వరరావు, చంగల్ రెడ్డి, గ్రానైట్ సూర్యనారాయణ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.అలాగే యువజన కమిటీ సభ్యులు నందు, అశ్విత్, భార్గవ్, రిత్విక్, రోహిత్, సాయి తదితరులు సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలను అందజేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదానం చేయడం ద్వారా సేవాభావాన్ని చాటుకున్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన భక్తులు, మహిళలు, యువజన కమిటీ సభ్యులు, అసోసియేషన్ సభ్యులకు అధ్యక్షులు జే. పురంధర్ రెడ్డి పేరుపేరునా ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.