పయనించే సూర్యుడు ఆగస్టు 27( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆత్మకూరు డిఎస్పీ .వేణుగోపాల్ తెలిపారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఆత్మకూరు ఇంచార్జ్ సిఐ వేమారెడ్డి ఆత్మకూరు ఎస్సై జిలానీలతో కలిసి విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ముందుగా ఆత్మకూరు డివిజన్ ప్రాంత ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ లో విగ్రహ ఏర్పాటు వివరాలు తెలిపి సంబంధిత పోలీస్ స్టేషన్ ద్వారా అనుమతులు పొంది భక్తి పార్వసంగా పవిత్రంగా పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 651 విగ్రహాలు ఏర్పాటు కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో మద్యం సేవించడం డీజే చిందులు అశ్లీల నృత్యాలు ఇతర గొడవలు జరగకుండా చూసుకోవాలని వీటి నివారణ కొరకు వినాయక విగ్రహ కమిటీ ఏర్పాటు చేసుకొని భక్తితో పండగ నిర్వహించుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డి.ఎస్.పి కె.వేణుగోపాల్ తెలిపారు. విగ్రహాలు ఏర్పాటు చేసిన మండపాల వద్ద అగ్ని ప్రమాదాలకు ఇతర విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.పవిత్ర వాతావరణంలో పండగను నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకు డివిజన్ పరిధిలోని ఎస్సైలు .సీఐలు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు