
పయనించే సూర్యుడు D.26.06.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్..CPI(ML) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ విప్లవొధ్యమ కార్యశీలి, మార్గదర్శి అమరుడు కామ్రేడ్ డివి.కృష్ణ. అని ఆయన జీవితాంతం ప్రజల కోసం పని చేసిన గొప్ప త్యాగశిలి అనిCPI(ML) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్అన్నారు.ఆర్మూర్ పట్టణంలో కుమార్ నారాయణ భవన్ ముందు గల డివి. కృష్ణ విగ్రహంకు పూల మాలలు వేసి నివాళులు హార్పించారు. నివాళులు అర్పించిన వారిలో జిల్లా, డివిజన్ నాయకులు బి దేవరాం, ఎస్ సురేష్, జి కిషన్, కె రాజేశ్వర్, వి సత్తేవ్వ, బి కిషన్, ఎం నరేందర్ పూలమాలలతో నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయం ముందు గల ఎర్రజెండాను పార్టీ జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ ఎగరావేశారు.ఈ సందర్బంగా జరిగిన వర్ధంతి సభకు ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం అధ్యక్షత వహించగా CPI(ML) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతు: విప్లవోద్యమ కార్యనిర్వహనలో భాగంగా గుంటూరు నుంచి ఇందూరుకు వచ్చి పల్లె పల్లె లవ్ విప్లవోద్యమాన్ని విస్తరించారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుని సైతం ఉద్యమాన్ని కోసమే వదిలి అంకితభావంతో కృషి చేశారన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడిన వీర యోధులు అని అన్నారు. ఎమర్జెన్సీ సమయములో తోటి సహచరులంతా బూటకపు ఎన్కౌంటర్లలో అమరత్వం పొందుతుంటే గుండె జారకుండా నిలబడి పార్టీ నాయకులకు శ్రేణులకు మనోధైర్యం ఇచ్చి ముందుకు నడిపిన గొప్ప యోధులు అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవ ఉద్యమ స్థితిగతులను మార్చాల్సిన అవసరం ఉందని గట్టిగా పోరాడిన ఎవరు అన్నారు. పల్లెల్లో బానిసత్వం పెరిగిన సమయంలో, అరాచకాలు విస్తృతంగా సాగుతున్న సమయంలో వాటి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించి పోరాడి భూములను ప్రజలకు పంచినవిప్లవ నాయకుడు అన్నారు. కార్మికుల రైతాంగ విద్యార్థి యువజన పోరాటంలో సమీకరించి, ప్రజా సంఘాల నిర్మించిన గొప్ప నాయకుడు అన్నారు. జిల్లాలో బీడీ రంగంలో కార్మికుల నిరక్షరాస్యతను తొలగించి రాత్రి పాఠశాల నిర్వహించి వారికి కార్మిక పోరాటాలు నిర్మించి కార్మిక సంఘాన్ని స్థాపించిన గొప్ప కార్మిక నాయకుడు అన్నారు. సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శిగా పని చేసాడని అయినా నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం అంకిత భావం తో పని చేసాడని అన్నారు. కామ్రెడ్ డివి కృష్ణ స్ఫూర్తిని అందరం పునికి పుచ్చుకొని బలమైన విప్లవోద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఆయనకు నివాళులు అర్పించడం అంటే బలమైన విప్లవోద్యమాలను నిర్మించడమే అన్నారు.టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం ముత్తేన్న, సీనియర్ జర్నలిస్ట్ కొంగర శ్రీనివాస్ లు ప్రసంగించగా జిల్లా, డివిజన్ మండల నాయకులు డివిజన్ కార్యదర్శి బి దేవరాం, ఎస్ సురేష్, జి కిషన్, కె రాజేశ్వర్, వి సత్తేవ్వ, బి కిషన్, ఎం నరేందర్, యు రాజన్న, జి నడిపేన్న, జి అరవింద్ , ఎస్ దుర్గాప్రసాద్, ఎం లక్ష్మి జి పద్మా ఎన్ లింబాద్రి
తదితరులు పాల్గొన్నారు.