
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జర్నలిస్టు కేపీలకు ఆహ్వాన పత్రిక అందజేత
( పయనించే సూర్యుడు జూలై 24 షాద్‌నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )టాలివుడ్ ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్, కవిత దంపతుల కుమార్తె జనని వివాహం చిలుకూరి నీలిమ కృష్ణ, చిలుకూరి శ్రీనివాస్ (విశాఖపట్నం) దంపతుల కుమారుడు సూర్య తేజతో జరగనున్న సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికలను ప్రముఖులకు అందజేస్తూ వివాహ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత వై. అంజయ్య యాదవ్ తదితరులను బండ్ల గణేష్ మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి, వివాహ మహోత్సవానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని ఆహ్వానించారు. అదే విధంగా షాద్‌నగర్ సీనియర్ జర్నలిస్ట్ ఎండి ఖాజాపాషా (కేపీ)ని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి వివాహ పత్రికను అందజేశారు. వివాహ వేడుక ఆదివారం, ఆగస్టు 16, 2026న ఉదయం 11:58 గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్, విస్పర్ వ్యాలీ, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్‌లో నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులను బండ్ల గణేష్ వివాహ వేడుకకు ఆహ్వానిస్తున్నారు..