పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణా బీసీ జేఎసి ఇచ్చిన తెలంగాణా బీసీ బంద్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్, ఆల్విన్ కాలనీ డివిజన్ ల బీసీ జేఎసి ఆధ్వర్యంలో వివేకానంద నగర్ వద్ద గల నేషనల్ హైవే ను దిగబందించడం జరిగింది, ఈ సందర్భంగా బి సి నాయకులు మాట్లాడుతూ బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నా బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారు అన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలను మోసం చేస్తున్నా మౌనంగా ఉన్నాము అన్నారు. 42 శాతం బిసి రిజర్వేషన్లను అమలు చెయ్యకపోతే తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతాం అన్నా. తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాబోతోంది, బీసీల రిజర్వేషన్లు అమలు చేసేలా న్యాయపరమైన చిక్కులు తెంచి అమలయ్యే విధంగా ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించాలి అన్నారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు చిత్తశుద్ధి తో పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నఅన్నారు. ఈ కార్యక్రమంలో కుమార్ యాదవ్, ఏకాంత్ గౌడ్, జిల్లా గణేష్, శివశంకర్ నేత,తెల్ల హరికృష్ణ,వంశీ కృష్ణ, నామాల శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్,రాఘవేంద్ర, రేపన రాజు, లక్ష్మణ్ , సాయి, అరుణ్, లాలన్, తిరునగరి శ్రీనివాస్, రాందాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..